ఎంత మంచి కంపెనీయో! డ్యూటీ టైం ముగియగానే ఆఫ్ అయిపోతున్న కంప్యూటర్లు!

ఎంత మంచి కంపెనీయో! డ్యూటీ టైం ముగియగానే ఆఫ్ అయిపోతున్న కంప్యూటర్లు!

Shift time over please go home Softgrid Computers shuts desktop after office hours
  • మధ్యప్రదేశ్‌లోని సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ వినూత్న ఆలోచన
  • తమ ఉద్యోగులు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోకుండా నిర్ణయం
  • పని వేళలు ముగిసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై మెసేజ్
  • ఇంకా పనిచేస్తే ఆటోమెటిక్‌గా లాక్
ఈ విషయం తెలిస్తే.. ఇంత మంచి కంపెనీలు కూడా ఉంటాయా? అనిపించకమానదు. ఆఫీసు వేళలు ముగిసినా ఇంకా కంప్యూటర్‌ను అంటిపెట్టుకుని ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని భావించిన ఓ ఐటీ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల షిప్ట్ టైం ముగిసిన వెంటనే కంప్యూటర్లు ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆ కంపెనీ పేరు సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంది. ముఖ్యమైన పనుల డెడ్‌లైన్ కారణంగా ఉద్యోగులు చాలా వరకు ఆఫీసులోనే గడిపేస్తున్నారని, ఫలితంగా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారని భావించిన కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల షిఫ్ట్ టైం ముగిసిన పది నిమిషాల తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై షిఫ్ట్ టైం పూర్తయిందని, దయచేసి ఇంటికి వెళ్లాలని వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఈలోపే పని పూర్తి చేసుకుని ఇంటికి బయల్దేరాలి. 

ఈ వినూత్న నిర్ణయంపై కంపెనీ హెచ్ఆర్ విభాగం స్పందిస్తూ.. ఇది ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రకటన కాదని స్పష్టం చేసింది. తమ ఉద్యోగులు వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. షిఫ్ట్ టైం ముగిసిన పది నిమిషాల తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై మెసేజ్ వస్తుందని, దీంతో సిస్టంను షట్‌డౌన్‌ను చేయాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ ఇంకా సిస్టం ముందే కూర్చుంటే అది ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుందని వివరిస్తూ లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్టు పెట్టింది. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Madhya Pradesh
Softgrid Computers
Indore
IT Company

More Telugu News