సజ్జల, విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి: టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు
- విశాఖలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకం ఆవిష్కరణ
- గొడ్డలిపోటును విజయసాయి గుండెపోటు అన్నారన్న పల్లా
- ప్రశాంత్ కిశోర్ ను కూడా విచారించాలని డిమాండ్
సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను సీబీఐ విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. వివేకా హత్యను ఉపయోగించి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందని... వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కూడా ఈ కేసులో విచారించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని పల్లా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.