రామ్ చరణ్ కొత్త ‘అవతార్’.. ఇదిగో!
- శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్
- రెండు పాత్రల్లో కనిపించనున్న మెగా పవర్ స్టార్
- చెర్రీకి కొత్త లుక్ ఇచ్చిన సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హాకిమ్
ఇందుకోసం సెలబ్రిటీల హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హాకిమ్ ను ఆశ్రయించారు. హాకిమ్ తనదైన శైలిలో చరణ్‌కి కొత్త హెయిర్ స్టయిల్ చేసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మా సూపర్ డూపర్ స్టార్ మరొక కొత్త అవతార్‌లో కనిపించడానికి రెడీ’ అని ట్వీట్ చేశాడు. చెర్రీ స్టయిల్ గా, మోడర్న్ గా ఉన్న ఈ లుక్ వైరల్ అయ్యింది. కాగా, ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యే బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా త్వరలోనే తిరిగి షూటింగ్ కు హాజరవనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.