అప్పుడు విజయసాయి రెడ్డి.. ఇప్పుడు అమర్ నాథ్: బుద్ధా వెంకన్న
- ఉత్తరాంధ్రలో అమర్ నాథ్ ట్యాక్స్ అమలవుతోందన్న వెంకన్న
- రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా కోసం బెదిరిస్తున్నారని ఆరోపణ
- క్వారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శ
రియలెస్టేట్ కంపెనీలు ఎక్కడ లేఔట్ లు వేసినా వాటా ఇవ్వాలని అమర్ నాథ్ బెదిరిస్తున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. అనకాపల్లి జిల్లాలో క్వారీ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన రాజధాని పేరుతో భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.