రూ. 4.98 కోట్ల విలువైన వాచీ ధరించిన షారుఖ్ ఖాన్.. వీడియో ఇదిగో!

 Shah Rukh Khan wears watch worth Nearly Rs 5 Cr
  • ‘పఠాన్’ ఈవెంట్‌లో పాల్గొన్న షారుఖ్
  •  చర్చనీయాంశంగా మారిన రిస్ట్ వాచీ
  • స్విస్ లగ్జరీ వాచ్ కంపెనీ అడెమర్స్ పిగెట్‌ తయారు చేసిన వాచీ ధరించిన ‘బాద్షా’
పఠాన్ సినిమా అందించిన అపురూప విజయంతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ తాజాగా ఓ ఈవెంట్‌లో కనిపించి చర్చనీయాంశంగా మారాడు. అందుకు కారణం అతడు ధరించిన వాచీనే. బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చిన షారుఖ్.. చేతికి బ్లూ కలర్ రిస్ట్ వాచ్ ధరించాడు. ఆ వాచీ ఖరీదు ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. చాలామంది తమ జీవితకాలంలో సంపాదించిన దానికంటే ఆ వాచీ విలువే ఎక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే దాని ఖరీదు రూ. 4.98 కోట్లు.  

‘పఠాన్’ జోడీ దీపికా పదుకొణే ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో షారుఖ్ ఈ వాచీతో కనిపించాడు. ఇద్దరూ ముస్తాబవుతున్నట్టు ఉన్న ఆ వీడియో ‘పఠాన్’ ఈవెంట్ కు ముందు తీసినది. షారుఖ్ ధరించిన ఆ వాచీపై అభిమానుల దృష్టి పడింది. దీంతో ఫ్యాషన్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘డైట్ సబ్యా’లో ఆరా తీశారు. ఆ వాచీ ‘అడెమర్స్ పిగెట్‌’ అనే స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ తయారీ కంపెనీకి చెందినదని సమాధానం వచ్చింది. ఇది ఆ కంపెనీ రాయల్ ఓక్ పెర్‌పెచ్యుయల్ క్యాలెండర్ వాచీ అని, దాని విలువ రూ. 4.98 కోట్లని డైట్ సబ్యా నుంచి రిప్లై వచ్చింది. 

కాగా, ముంబైలోని మన్నత్‌లో ఉన్న షారుఖ్ ఇంటి విలువ రూ. 200 కోట్లు పైమాటే. ఢిల్లీలోనూ షారుఖ్ కు విలాసవంతమైన నివాసం ఉంది. అలాగే, లగ్జరీ బీఎండబ్ల్యూ 6 సిరీస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి, ఇతర కార్లు ఉన్నాయి.
Go Back to Shorts
Shah Rukh Khan
Bollywood
Pathaan
Deepika Padukone
Audemars Piguet

More Telugu News