ఇలియానాకు ఏమయిందో వివరించిన ఆమె తల్లి
- అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇలియానా
- ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపిన ఆమె తల్లి
- ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడి
మరోవైపు, ఇలియానా అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో తాను ఉన్నానంటూ ఇలియానా చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో తన కూతురి అనారోగ్యంపై ఆమె తల్లి స్పందించారు. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో, ఆమె డీహైడ్రేషన్ కు గురయిందని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఇల్లీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.