బాయ్ కాట్ ట్రెండ్ పై కరీనా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్
- సినీ పరిశ్రమకు ఇది మంచిది కాదన్న కరీనా
- సినిమాలు లేకపోతే మీకు వినోదం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్న
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ 'పఠాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని 'బేషరమ్' పాటలో దీపిక కాషాయం రంగు బికినీ ధరించి అందాలను ఆరబోసింది. దీంతో, ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమిర్ ఖాన్ తో కలిసి తాను నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా సైతం బాయ్ కాట్ దెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది.