Team India: రెండో వన్డేలో కివీస్ ను చిత్తుచేసి సిరీస్ చేజిక్కించుకున్న భారత్

Team India defeated New Zealand in 2nd ODI and clinch series
షార్ట్స్‌లో చూడండి
సొంతగడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. నేడు న్యూజిలాండ్ తో రాయ్ పూర్ లో జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్... అనంతరం 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ (51) అర్ధసెంచరీతో అలరించగా, తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో షిప్లే 1, శాంట్నర్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఈ నెల 24న మూడో వన్డే జరగనుంది. నామమాత్రంగా మారిన ఈ వన్డేకు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా నిలవనుంది.
Go Back to Shorts
Team India
New Zealand
2nd ODI
Series

More Telugu News