జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి సిద్ధం: అలీ
- పవన్ తనకు మంచి మిత్రుడన్న అలీ
- సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని వ్యాఖ్య
- వైసీపీ 175 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా
ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 175 స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఆదేశం మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ చిత్రాల్లో ఒకటి, రెండు మినహా అన్ని సినిమాల్లో అలీ నటించారు. అయితే, గత ఎన్నికల సమయం నుంచీ ఆయన వైసీపీకి అనుకూలంగా మారారు.