Nagarjuna: యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించిన నాగార్జున, పూజాహెగ్డే

Nagarjuna and Pooja Hegde acts in a soft drink ad
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కింగ్ నాగార్జున, అందాలభామ పూజా హెగ్డే ఇప్పటివరకు ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు. అయితే, ఇప్పుడు వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ కోసం జతకట్టారు. ఇటీవలే ఈ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణ జరిగింది. ఇదొక ఫ్రూట్ జ్యూస్ డ్రింక్. ఈ సాఫ్ట్ డ్రింక్ వాణిజ్య ప్రకటనకు అర్జున్ మాలిక్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ యాడ్ ప్రసార మాధ్యమాల్లో సందడి చేయనుంది. 

కాగా, ఘోస్ట్ తర్వాత నాగ్ నుంచి మరో చిత్రం రాలేదు. 'ధమాకా' రచయిత ప్రసన్నకుమార్ బెజవాడతో ఆయన తన తదుపరి ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో అఖిల్ కూడా నటిస్తున్నాడు. ఇక పూజా హెగ్డే... మహేశ్ బాబు-త్రివిక్రమ్ మూవీలో కనువిందు చేయనుంది.
Go Back to Shorts
Nagarjuna
Pooja Hegde
Ad Film
Soft Drink
Fruit Juice

More Telugu News