తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది: నారా లోకేశ్
- 1983లో ఇదే రోజున సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం
- ఇది నిజమైన పండుగరోజు అన్న లోకేశ్
- ఎన్టీఆర్ క్రమశిక్షణ, స్ఫూర్తి టీడీపీకి బలం అని వెల్లడి
అణగారినవర్గాల అభ్యున్నతి, తెలుగుజాతి ఆత్మాభిమానం పరిరక్షణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు నందమూరి తారకరామారావు అని కీర్తించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9వ తేదీ నిజమైన పండగరోజు అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ క్రమశిక్షణ, సంపాదించిన కీర్తి, చూపిన స్ఫూర్తి తెలుగుదేశం బలం అని స్పష్టం చేశారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం ఉంటుందని నారా లోకేశ్ ఉద్ఘాటించారు. జై తెలుగుదేశం... జోహార్ ఎన్టీఆర్... అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.