మా అమ్మాయికి తాగే అలవాటు లేదు.. అసలు ఆ నిధి పేరే వినలేదంటూ.. ఢిల్లీ కారు ఘటన మృతురాలి తల్లి కీలక వ్యాఖ్యలు
- ఆమె స్నేహితురాలు నిధి అబద్ధం చెబుతోందన్న అంజలి తల్లి
- స్నేహితురాలైతే ప్రమాదం జరిగినప్పుడు ఎలా వదిలేసి వెళ్తుందని ప్రశ్న
- కుట్రలో నిధి కూడా భాగం కావొచ్చని ఆరోపణ
తన కుమార్తె మరణం కుట్రలో నిధి భాగమని ఆమె ఆరోపించారు. ‘నేను నిధిని ఎప్పుడూ చూడలేదు. ఆమె పేరు కూడా వినలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఆమె నా కూతురి స్నేహితురాలైతే, ఆమెను వదిలేసి ఎలా పారిపోతుంది? ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర. ఇందులో నిధి పాత్ర కూడా ఉండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి' అని ఆమె డిమాండ్ చేశారు. కాగా, కారు ఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం మత్తులో ఉందని, ఆమె స్పృహలో లేదని నిధి చెప్పింది. కానీ, శవపరీక్ష నివేదికలో ప్రమాదం జరిగిన రాత్రి ఆమె మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడైంది.