పయ్యావుల కేశవ్ ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందన.. అనంతపురంలో అవినాశ్ కుమార్ పర్యటన
- ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కేశవ్
- ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ
- రెండు గంటలపాటు అధికారులను విచారించిన వైనం
- బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే సీఈసీపై నమ్మకం పోతుందన్న పయ్యావుల
అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. లేదంటే సీఈసీపై నమ్మకం పోతుందని చెప్పానన్నారు. విచారణ కోసం సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాకు వస్తున్న విషయం తెలిసి ముందు రోజే ఇద్దరు బీఎల్వోలను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారని ఆరోపించారు. నిజానికి ఓట్ల తొలగింపులో బీఎల్వోల పాత్ర ఏమీ ఉండదని, ఓట్ల అక్రమ తొలగింపునకు ఆమోదం తెలిపిన ఏఈఆర్, ఈఆర్వోలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.