ప్రపంచంలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఒక్క డొనాల్డ్ ట్రంప్‌కు తప్ప: రాంగోపాల్ వర్మ
- పాత సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయన్న ఆర్జీవీ
- ఎవరూ ఎవరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం లేదన్న దర్శకుడు
- కొత్త నటులు ఈ ఏడాది షారుఖ్, సల్మాన్, ఆమిర్‌లను మించిపోవాలని ఆకాంక్ష
కొత్త ఏడాదిలో నేరస్థులెవరూ పట్టుబడకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్ని నేరాలు ఆగిపోవాలని, పోలీసులు పని లేకుండా ఉండాలని ఆర్జీవీ ఆకాంక్షించారు. అవకాశాల కోసం వేచి చూస్తున్న నటులు ఈ ఏడాది షారుఖ్, సల్మాన్, ఆమిర్‌ఖాన్‌లను మించిపోవాలని కోరుకున్నారు. మీ శత్రువులందరూ కలిసి మిమ్మలని వెన్నుపోటు పొడిచే వారి నుంచి కాపాడాలని, కొత్త ఏడాదిలో కరోనా వైరస్‌కు డేంజరస్ వ్యాక్సిన్ల నుంచి ఇమ్యూనిటీ రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ కొత్త ఏడాదిలో ముకేశ్ అంబానీ తన సంపదనంతా తన కుమారులకు కాకుండా మీ అందరికీ పంచిపెట్టాలని కోరుకుంటున్నట్టు ఆర్జీవీ పేర్కొన్నారు. భార్యలందరూ ఈ కొత్త ఏడాదిలో భర్తలను మరింత అర్థం చేసుకోవాలని రాంగోపాల్ వర్మ ఆకాంక్షించారు.