టీషర్టుతో చలిని ఎలా ఎదుర్కోవాలో ఓ వీడియో రూపొందిస్తా: రాహుల్ గాంధీ
- భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ
- డిసెంబరు 24న ఢిల్లీ చేరిక
- ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- అంత చలిలోనూ టీషర్టుతోనే కనిపించిన రాహుల్
- చలిని ఎలా తట్టుకుంటున్నారని ప్రశ్నించిన మీడియా
అయితే, ఎముకలు కొరికే చలికి నెలవైన ఢిల్లీలోనూ ఆయన స్వెట్టర్ వేసుకోకుండా టీషర్టుపైనే కనిపించారు. రాహుల్ టీషర్టు వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో ఆయనను ఈ విషయమై మీడియా ప్రశ్నించింది.
అందుకు రాహుల్ గాంధీ సరదాగా బదులిచ్చారు. భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత... టీషర్టు ధరించి చలిని ఎదుర్కోవడం ఎలా? అనే వీడియో రూపొందిస్తానంటూ అందరినీ నవ్వించారు.
తన టీషర్టుపై అందరికీ అంత బాధేంటో అర్థంకావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఢిల్లీలో తనకేమీ చలి అనిపించడంలేదని, ఒకవేళ చలి అని భావిస్తే అప్పుడు స్వెట్టర్ గురించి ఆలోచిస్తానని రాహుల్ అన్నారు.