తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడు!

తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు నడిరోడ్డుపై యువతిని చావబాదిన ప్రియుడు!

Man beats up 19 year old girlfriend for asking him to marry her in MP
  • మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘటన
  • నడిరోడ్డుపై కిందపడేసి ప్రియురాలిపై దాడి
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు నిరాకరించడంతో విడిచిపెట్టిన పోలీసులు
పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని నడిరోడ్డుపైనే చావబాదాడో ప్రియుడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలోని యువకుడిని మౌగంజ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 ఏళ్ల పంకజ్ త్రిపాఠిగా గుర్తించారు. 19 ఏళ్ల అమ్మాయితో అతడు ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో నడిరోడ్డుపైనే ఆమెను కిందపడేసి దాడిచేసి చితకబాదాడు. గత బుధవారం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. 

వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తాజాగా నిందితుడు పంకజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, అతడిపై ఫిర్యాదు చేసేందుకు బాధిత యువతి నిరాకరించడంతో ఆ తర్వాత నిందితుడిని పోలీసులు వదిలిపెట్టారు.
Advertisement
Madhya Pradesh
Rewa Dist
Girl Friend
Crime News

More Telugu News