పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు.. ప్రకటించిన చిత్ర బృందం
- కీలక పాత్రలో నటించనున్న బాబీ డియోల్
- షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బాబీ
- వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న చిత్రం
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన సెట్ కు వచ్చిన వీడియోను శనివారం విడుదల చేసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన దర్బార్ సెట్లో పవన్, బాబీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు క్రిష్ షెడ్యూల్ రూపొందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.