ఖుష్బూ కుటుంబంలో విషాదం... అనారోగ్యంతో సోదరుడు కన్నుమూత
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబూ బాకర్
- పరిస్థితి విషమం.. వెంటిలేటర్ అమర్చిన వైద్యులు
- చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సోదరుడు
మనం ఎంతో ప్రేమించే వ్యక్తులు మనతోనే ఉండాలని కోరుకుంటామని, కానీ అది జరగదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సోదరుడి ప్రస్థానం ఇవాళ్టితో ముగిసిందని పేర్కొన్నారు. తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. తన సోదరుడు చావుబతుకుల మధ్య ఉన్నాడని, అతడికి మీ ప్రార్థనలు అవసరం అంటూ అభిమానులను కోరారు.