ఇషాన్ కిషన్ మరో సెంచరీ.. ఈ సారి రంజీ ట్రోఫీలో!
- ఝార్ఖండ్ తరఫున కేరళపై శతకం
- రంజీల్లో ఆరో సెంచరీ నమోదు
- ఇటీవల బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీ చేసిన ఇషాన్
ఓ దశలో 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఝార్ఖండ్ ను ఇషాన్ ఆదుకున్నాడు. అతను మొత్తం 195 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 132 పరుగులు రాబట్టడంతో ఝార్ఖండ్ కోలుకుంది. రంజీల్లో ఇషాన్ కు ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. 175 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కేరళ అనంతరం రెండో ఇన్నింగ్స్ లో గురువారం ఆట ముగిసే సమయానికి 60/1 స్కోరుతో నిలిచింది.