హైదరాబాద్‌లో చంపేస్తున్న చలి.. పలు ప్రాంతాల్లో వర్షం
- నగరంలో గత అర్ధరాత్రి నుంచి వర్షం
- శీతల గాలులతో జనం ఇబ్బంది
- మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, నారాయణగూడ, హయత్ నగర్, సరూర్ నగర్ సహా దాదాపు నగరమంతా ఈ ఉదయం నుంచి వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.