CBI: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖకు బదులిచ్చిన సీబీఐ

CBI replies to Kavitha correspondence
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ... కవితను విచారించేందుకు ఇటీవల సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 6న విచారణ జరుపుతామని పేర్కొంది. కవితకు అనుకూలమైన చోట విచారిస్తామని కూడా సూచించింది. 

అయితే కవిత స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, తాను డిసెంబరు 6న విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ సీబీఐకి లేఖ రాశారు. తాను 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ కొన్ని తేదీలను పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు కవితకు బదులిచ్చింది. ఈ నెల 11న విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. హైదరాబాదులోని కవిత నివాసంలోనే విచారణ జరుపుతామని, ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం అందించింది.
Go Back to Shorts
CBI
Kavitha
Delhi Liquor Scam
TRS
Telangana

More Telugu News