శేష్ ను చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంటుంది: నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శేష్ ను చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంటుంది: నాని

HIT 2 Blockbuster Celebrations
  • నాని నిర్మాణంలో వచ్చిన 'హిట్ 2'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • సందడిగా సాగిన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ 
  • శేష్ ను అభినందించిన నాని  
నాని తన సొంత బ్యానర్లో 'హిట్ 2' సినిమాను నిర్మించాడు. అడివి శేష్ - మీనాక్షి చౌదరి జంటగా ఈ సినిమా రూపొందింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, కొంతసేపటి క్రితం 'బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' ను జరుపుకుంది. ఈ స్టేజ్ పై నాని మాట్లాడుతూ .. "ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ .. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నాడు. 

"ఈ సినిమాలో కోమలీ ప్రసాద్ చాలా గొప్పగా చేసింది. డిఫరెంట్ రోల్స్ తో తాను బిజీ అవుతుందని భావిస్తున్నాను. ఇక మీనాక్షి తన గ్లామర్ తో ఈ సినిమాలోని వైలెన్స్ ను బ్యాలెన్స్ చేసింది. ఎడిటింగ్ పరంగా గ్యారీ బీహెచ్ .. కెమెరా వర్క్ పరంగా మణికందన్ తన క్రాఫ్ట్ పట్ల తమకి గల పట్టును మరోసారి నిరూపించారు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 

"చిన్నప్పుడు నాకంటే బాగా చదివే కుర్రాణ్ణి చూసి నేను టెన్షన్ పడేవాడిని. అలా ఇప్పుడు అడివి శేష్ చూసి టెన్షన్ పడుతున్నాడు. ఏ విషయంలోను ఎక్కడా రాజీ పడకుండా పెర్ఫెక్ట్ గా ఉండటానికి అడివి శేష్ ప్రయత్నిస్తాడు. మేజిక్ ను కాకుండా కష్టాన్ని నమ్ముకోవడం వల్లనే హిట్లు కొడుతూ వెళుతున్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు.
Advertisement
Adivi Sesh
Meenakshi
Komali Prasad
Hit 2 Movie

More Telugu News