'హిట్ 3'లోను నేను ఉండాలి: కోమలి ప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హిట్ 3'లోను నేను ఉండాలి: కోమలి ప్రసాద్

HIT 2 Blockbuster Celebrations
  • ఈ నెల 2వ తేదీన థియేటర్లకు వచ్చిన 'హిట్ 2'
  • ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు గ్రాస్ 11.27 కోట్లు 
  • 'వర్ష' పాత్రలో మెప్పించిన కోమలి ప్రసాద్
  • అడివి శేష్ సపోర్టు కారణంగానే బాగా చేశానని వెల్లడి  
అడివి శేష్ - శైలేశ్ కొలను కాంబినేషన్లో రూపొందిన 'హిట్ 2' సినిమా, ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాలో రావు రమేశ్ కీలకమైన పాత్రను పోషించాడు. తొలిరోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11.27 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 

ఈ నేపథ్యంలో 'బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్' పేరుతో ఈ సినిమా టీమ్ ఈవెంటును నిర్వహించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న అడివి శేష్ కి సహాయకారిగా కోమలీ ప్రసాద్ నటించింది. ఆమె పోషించిన 'వర్ష' పాత్రకి మంచి మార్కులే దక్కాయి.  ఈ సెలబ్రేషన్స్ లో కోమలి ప్రసాద్ మాట్లాడింది. 

"ఈ సినిమాకి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూశాను. ఇలాంటి ఒక సినిమాలో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ జోనర్ ఫిలిమ్స్ శేష్ ఎక్కువగా చేసి ఉండటం వలన, ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందువల్లనే 'వర్ష' పాత్రను అంత బాగా చేయగలిగాను. 'హిట్ 3'లో కూడా 'వర్ష' ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటానని నానిగారు చెబితే బాగుంటుంది" అంటూ ముగించింది.
Advertisement
Adivi Sesh
Meenakshi
Hit 2 Movie
Komali Prasad

More Telugu News