'హిట్ 2'కు పాజిటివ్ రివ్యూలు.. ఓటీటీ హక్కులు ఆ సంస్థ సొంతం!
- ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా
- టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలు
- భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్ కొన్న అమెజాన్ ప్రైమ్ వీడియో
నేచురల్ స్టార్ నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే కనీసం నెల రోజులైనా ఎదురు చూడాల్సివుంది.