సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
- బుధవారం ఏపీ సీఎస్ గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ
- సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ తో పాటు కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ గా బాధ్యతల స్వీకారం
- తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన రిటైర్డ్ ఐఏఎస్
ఈ క్రమంలో బుధవారం సీఎస్ గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ... గురువారం కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ పదవితో పాటు సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన ఈ రెండు పదవులను చేపట్టిన తర్వాత గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కొత్త పదవుల్లో నియమించినందుకు సమీర్ శర్మ సీఎం కు ధన్యవాదాలు తెలిపారు.