తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల
- నోటిఫికేషన్ ను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
- మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడి
- ఈ నెల 23 నుంచి జనవరి 12 దాకా దరఖాస్తులకు అవకాశం
- ఏప్రిల్ లేదా మే నెలల్లో పరీక్ష నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జారీ అయిన ఈ నోటిఫికేషన్ కు ఈ నెల 23 నుంచి జనవరి 12 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ పరీక్ష తేదీలను వెల్లడించని అధికారులు... పరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.