జపాన్ లో రహస్యంగా తలదాచుకుంటున్న చైనా దిగ్గజ వ్యాపారవేత్త
- టోక్యోలో ఉంటున్న అలీబాబా అధినేత జాక్ మా
- టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు ఉక్కుపాదం
- అప్పటి నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త
అప్పటి నుంచి జాక్ మా ప్రజలకు కనిపించడం లేదు. చైనా సర్కారే జాక్ మాను ఏదో చేసి ఉండొచ్చన్న సందేహాలు కూడా ఆ మధ్య వచ్చాయి. జాక్ మాకు చెందిన యాంట్ గ్రూపు ఐపీవోకు కమ్యూనిస్ట్ సర్కారు అనుమతించలేదు. పెద్ద ఎత్తున జరిమానాలు కూడా విధించింది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. జాక్ మా ఆరు నెలలుగా టోక్యోలో కుటుంబంతో కలసి ఉంటున్నారు. మధ్యలో అమెరికా, ఇజ్రాయెల్ ను సందర్శించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ (బ్రిటిష్ వార్తా పత్రిక) పేర్కొంది.