హిందీ ‘దృశ్యం 2’కి కలెక్షన్ల వర్షం.. తొలివారంలోనే వంద కోట్ల క్లబ్ దిశగా పరుగులు
Add ap7am to your home Screen

హిందీ ‘దృశ్యం 2’కి కలెక్షన్ల వర్షం.. తొలివారంలోనే వంద కోట్ల క్లబ్ దిశగా పరుగులు

 Ajay Devgn Drishyam 2 film brings back hope for Bollywood
  • అజయ్ దేవగణ్, శ్రియ, టబూ, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా
  • ఈ నెల 18వ తేదీన విడుదలై విశేష స్పందన
  • ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మారే అవకాశం
అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం2’ బాక్సాఫీస్ వద్ద మళ్లీ జోష్ నింపింది. ఈ మధ్య బాలీవుడ్ ప్రముఖులకు చెందిన చిత్రాలన్నీ బోల్తా కొడుతుండగా.. అజయ్ దేవగణ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. దృశ్యం2 ఈ నెల 18వ తేదీన విడుదలైంది. ఒక వారం కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.86 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రానికి తొలి రోజు రూ. 15.38 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రతి రోజూ రూ. 10–15 కోట్లకు పైనే వసూళ్లు వస్తున్నాయి. మంగళవారం దృశ్యం 2 మొత్తం 18.27 శాతం హిందీ ఆక్యుపెన్సీ సాధించింది. ఈ లెక్కన ఈ చిత్రం మొదటి వారంలోనే 100 కోట్ల క్లబ్‌ లో చేరేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే భూల్ భూలాయ 2, గంగూబాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ వంటి హిట్ బాలీవుడ్ చిత్రాల తొలి వారాంతపు కలెక్షన్లను అధిగమించింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం కూడా ఉంది.
Bollywood
ajay devgn
Drishyam 2
100cr
collections

More Telugu News