బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇలా ఉంటుంది... రూ. 16 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లు వసూలు చేసింది!
Add ap7am to your home Screen

బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇలా ఉంటుంది... రూ. 16 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లు వసూలు చేసింది!

Kantara movie enters Rs 400 club
  • పాన్ ఇండియా లెవెల్లో దుమ్మురేపిన 'కాంతార'
  • మరో 3 కోట్లు సాధిస్తే కన్నడలో 'కేజీఎఫ్-2' రికార్డు బద్దలు
  • రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న చిత్రం
బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఏంటో, బాక్సాఫీస్ ను షేక్ చేయడం అంటే ఏంటో కన్నడ చిత్రం 'కాంతార' నిరూపించింది. ఈ సినిమాను వందల కోట్లు పెట్టి తీయలేదు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. రూ. 400 కోట్ల వసూళ్లను సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందంటే... ప్రేక్షకులను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్థమవుతుంది. 

కన్నడలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 168.50 కోట్లను వసూలు చేసింది. మరో రూ. 3 కోట్లను సాధిస్తే 'కేజీఎఫ్-2' రికార్డును బ్రేక్ చేస్తుంది. 'కేజీఎఫ్' సినిమా కన్నడలో రూ. 171.50 కోట్లను వసూలు చేసింది. 'కాంతార' చిత్రాన్ని రిషబ్ శెట్టి నటిస్తూ, తానే దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించింది. నవంబర్ 24 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రం మరెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Kantara
Tollywood
Bollywood
Collections

More Telugu News