పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ: చంద్రబాబు

Chandrababu fires on YSRCP govt
  • ఏపీ నుంచి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ
  • తాము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోతున్నాయన్న చంద్రబాబు
  • సీమ ద్రోహులు ఎవరని ప్రశ్న
జాకీ బ్రాండ్ దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ ఏపీని వదిలేసి వెళ్లిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. రాయలసీమలో తాము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి? పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా... లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు... 'నేతలను మేపలేక జాకీ పరార్' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన షేర్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jockey
YSRCP

More Telugu News