ఊహకు అందని విధంగా సలార్ యాక్షన్ సీన్స్ ఉంటాయంటున్న విలన్​
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఊహకు అందని విధంగా సలార్ యాక్షన్ సీన్స్ ఉంటాయంటున్న విలన్​

Prabhas Salaar is a Huge Action Sequence
  • రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్
  • పాల్గొంటున్న హీరో ప్రభాస్, విలన్ పృథ్వీరాజ్
  • యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోతాయంటున్న పృథ్వీరాజ్ 
బాహుబలి సిరీస్ తర్వాత మరో హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రాధేశ్యామ్ అయితే ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో అశలు పెట్టుకున్నాడు. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీయఫ్‌ 1, 2 అఖండ విజయాల తర్వాత ప్రశాంత్‌ నీల్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయితే.. నీల్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.

దాంతో, సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను ప్రశాంత్ నీల్ రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. వాళ్లు రూపొందించిన డిజైన్ చేసిన యాక్షన్స్ సీన్స్‌ సినిమాకు  హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రభాస్‌తో పాటు విలన్‌ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ నీల్ విజన్‌, ఆయన దర్శకత్వ ప్రతిభకు తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉంటాయంటున్నాడు. ఈ వ్యాఖ్యలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన  శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas
salar
movie
bahubali
shooting
RFC
Prashanth neel

More Telugu News