ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్!
- వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టు
- భారత్ తో నాలుగు టెస్టులు ఆడనున్న ఆసీస్
- తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఛాన్స్
కాగా, ఆస్ట్రేలియాతో సిరీస్ కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే, రెండో టెస్టును ఢిల్లీలో, మూడో టెస్టును ధర్మశాలలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. చివరి టెస్టుకు అహ్మదాబాద్‌ను వేదికగా అనుకుంటోంది. ఈ నాలుగు టెస్టుల్లో ఒకటి డే నైట్ (పింక్ బాల్) మ్యాచ్‌గా ఉండనుంది. ప్రపంచంలోనే అది పెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.