ఆశయం నెరవేరాకే పెళ్లి చేసుకుంటా: సినీ నటుడు విశాల్
- హైదరాబాద్‌లో లాఠీ సినిమా టీజర్ లాంచ్ వేడుక
- పెళ్లిపై యాంకర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన విశాల్
- సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ భవనం పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుంటానన్న నటుడు
- 3,500 మంది థియేటర్ ఆర్టిస్టులు ఇంకా చినిగిన దుస్తులతోనే ఉన్నారని ఆవేదన
3,500 మంది థియేటర్ ఆర్టిస్టులు ఇంకా చిరిగిన దుస్తులు, మేకప్ లేకుండానే నాటకాలు వేస్తున్నారని, మూడున్నర దశాబ్దాల క్రితం వారెలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉన్నారని విశాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారంతా బాగుండాలనే ఈ భవనం కట్టిస్తున్నామని, వారికి పింఛను ఇప్పించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించి జీవన విధానాన్ని మార్చాలని అనుకుంటున్నామని చెప్పాడు. ఆ ఆశయం నెరవేరకుండా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.
అందరికీ చెప్పే వివాహం చేసుకుంటానని, తప్పకుండా అందరూ రావాలని కోరాడు. విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెబుతున్న అభినయ మరెవరో కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్, మహేశ్ బాబు సోదరిగా కనిపించిన అమ్మాయే. ఆ తర్వాత ఆమె నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ధ్రువ, రాజుగారి గది 2 తదితర సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆమె పలు సినిమాల్లో నటించింది.