అతను నా పక్కన ఉంటే సంతోషంగా ఉంటాను: బాయ్ ఫ్రెండ్ పై జాన్వీ కపూర్ కామెంట్
- ఒర్హాన్ తో జాన్వీ డేటింగ్ చేస్తోందని ప్రచారం
- అతను తనకు చాలా ఏళ్లుగా తెలుసన్న జాన్వీ
- ప్రతి విషయంలో తనకు అండగా ఉన్నాడని వ్యాఖ్య
తన తాజా చిత్రం 'మిలీ' ప్రమోషన్ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ... ఒర్హాన్ చాలా ఏళ్లుగా తనకు తెలుసని చెప్పింది. అతనితో ఉంటే తాను ప్రతి క్షణం సంతోషంగా ఉంటానని తెలిపింది. ప్రతి విషయంలో ఎంతో కాలంగా తనకు అండగా ఉన్నాడని చెప్పింది. ఒర్హాన్ తన పక్కన ఉంటే తమ ఇంట్లోనే ఉన్నాననే భావన కలుగుతుందని తెలిపింది.