విజయోత్సవ ర్యాలీ కోసం అనుమతి కోరిన కేఏ పాల్!
- మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ పడ్డ కేఏ పాల్
- ప్రచారంలో తానే గెలుస్తానని చెప్పిన వైనం
- ఏడు రౌండ్లలో పాల్ కు వచ్చింది 322 ఓట్లే
కాగా, ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి పాల్ మొత్తంగా 322 ఓట్లు మాత్రమే సాధించారు. ఏడో రౌండ్ లో ఆయనకు 31 ఓట్లు లభించాయి. ఈ లెక్కన పాల్ వెయ్యి ఓట్లు సాధిస్తే గొప్పే అనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తానే గెలుస్తానని పాల్ చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ కోసం ఆయన ముందుగానే అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తన ప్రచారం, హావభావాలు, చర్యలతో కేఏ పాల్.. ఉత్కంఠగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో అందరినీ నవ్విస్తున్నారు.