పెళ్లయినా సినిమాలు ఆపేది లేదంటున్న హన్సిక
- ప్రియుడు సోహెల్ తో హన్సికకు నిశ్చితార్థం
- డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న జంట
- ప్రస్తుతం హన్సిక చేతిలో పలు చిత్రాలు
అయితే, హన్సిక మాత్రం తన వివాహానంతరం సినిమాలకు వీడ్కోలు చెప్పే ఆలోచనలో లేదు. పెళ్లయినా కెరీర్ కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. ‘పెళ్లయ్యాక పని ఎందుకు మానేయాలి?’ అని హన్సిక అంటోంది. ఇక, తన ప్రియుడు సోహెల్ తనకు అత్యంత రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడని హన్సిక వెల్లడించింది. హన్సిక చివరగా యుఆర్ జమీల్ దర్శకత్వం వహించిన ‘మహా’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘పార్ట్‌నర్’, ‘రౌడీ బేబీ’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘గార్డియన్’, ‘ఎంవై3’ అనే చిత్రాలు నిర్మాణ దశల్లో ఉన్నాయి.