హీరో విశాల్ ను పెళ్లి చేసుకోబోతోందనే వార్తలపై సినీ నటి అభినయ స్పందన!

Actor Vishal in love with actress Abhinaya
  • గతంలో సినీ నటి వరలక్ష్మి ప్రేమలో ఉన్న విశాల్
  • ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం
  • ఇప్పుడు అభినయతో ప్రేమలో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం
కోలీవుడ్ లో మన తెలుగు హీరో విశాల్ కు చాలా క్రేజ్ ఉంది. కేవలం నటుడిగానే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంఘాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు, ఇప్పటికీ విశాల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో గతంలో విశాల్ ప్రేమలో ఉన్నాడు. అయితే, ఆ తర్వాత వారి బంధం తెగిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన ఒక యువతితో విశాల్ కు నిశ్చితార్థం జరిగింది. అయితే, ఏం జరిగిందో కానీ... వారి పెళ్లి ఆగిపోయింది. 

ఇప్పుడు విశాల్ కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నాడని... వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. ఈ వార్తలపై విశాల్ ఇంత వరకు స్పందించలేదు. తాజాగా అభినయ ఈ అంశంపై స్పందిస్తూ.. ఇందులో నిజం లేదని తెలిపింది. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో విశాల్ కు భార్యగా నటిస్తున్నానని... సినిమాలో భార్యగా నటించినంత మాత్రాన రియల్ లైఫ్ లో కూడా భార్య అయిపోతానా? అని చమత్కరించింది. దీంతో, ఈ పుకార్లకు తెర పడినట్టయింది.
Go Back to Shorts
Vishal
Abhinaya
Love
Marriage
Kollywood
Tollywood

More Telugu News