టాంజానియాలో గరిట తిప్పిన రామ్ చరణ్
- ఓపెన్ టాప్ జీప్ లో సఫారీలో పర్యటన
- బహిరంగ ప్రదేశంలో ఆమ్లెట్ తయారీ
- సింహాన్ని ఫొటో తీస్తూ పర్యటనను ఎంజాయ్ చేసిన చరణ్, ఉపాసన
తాను జీప్ నడుపుతున్న వీడియో క్లిప్ ను రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ప్రాంతం వన్యప్రాణి అభయారణ్యం అని తెలుస్తోంది. ఎందుకంటే అదే జీప్ నుంచి కెమెరాతో సమీపంలోని సింహాన్ని ఫొటో తీయడాన్ని వీడియోలో చూడొచ్చు. తమ పర్యటనకు సంబంధించిన దృశ్యాలను ఉపాసన కూడా సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 21న విడుదలైంది. దీనికి ముందు అక్కడ సినిమా ప్రచారం కోసం రామ్ చరణ్ దంపతులు వెళ్లారు. అటు తర్వాత వీరు టాంజానియాలో పర్యటిస్తున్నారు. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)