హిట్ టాక్ తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
- మంగళవారం విడుదలైన అక్షయ్ తాజా సినిమా
- మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ. 15.25 కోట్లు వసూలు
- వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అక్షయ్ కుమార్ ఖాతాలో విజయం
‘బ్రహ్మాస్త్ర’ తర్వాత రామ్ సేతు ఈ సంవత్సరంలో రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌ను కూడా సాధించడం విశేషం. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచాతో పాటు తెలుగు యువ నటుడు సత్యదేవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది యాక్షన్-అడ్వెంచర్ డ్రామా. రామసేతు పురాణమా లేదా వాస్తవమా అనే విషయాన్ని పరిశోధించే పురావస్తు శాస్త్రజ్ఞుడి పాత్రలో అక్షయ్ నటించారు. ఈ చిత్రాన్ని అక్షయ్‌కి చెందిన కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.