బ్రిటన్ ప్రధాని రాజీనామాను ప్రస్తావిస్తూ మోదీపై కేటీఆర్ సెటైర్లు
- విఫల ఆర్థిక విధానాల కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారనే వార్తతో ఆనందించానన్న కేటీఆర్
- మన ప్రధాని అత్యధిక నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇచ్చారని వ్యాఖ్య
- రూపాయి విలువను పతనం చేశారని ఎద్దేవా
తన విఫలమైన ఆర్థిక విధానాల కారణంగా 45 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసినట్టు చదివి ఆనందించానని కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో కూడా ఒక ప్రధాని ఉన్నారని... ఆయన మనకు ఏం ఇచ్చారంటే... 30 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగం, 45 ఏళ్ల కాలంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలో అతి ఎక్కువ గ్యాస్ ధర, అమెరికా డాలరుతో పోలిస్తే అతి తక్కువ రూపాయి విలువ అంటూ ఎద్దేవా చేశారు.