చిరంజీవి-గరికపాటి వివాదంపై ఆర్జీవీ ట్వీట్ల వర్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి-గరికపాటి వివాదంపై ఆర్జీవీ ట్వీట్ల వర్షం

RGV setires on garikapati over chiranjeevi issue
  • నేరుగా గరికపాటి పేరు ప్రస్తావించకుండా సెటైర్లు 
  • మెగాస్టార్ ను అవమానించిన వారిని క్షమించే ప్రసక్తే లేదని వ్యాఖ్య
  • ఆ గడ్డికి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటూ విమర్శ
మెగాస్టార్ చిరంజీవి-గరికపాటి నరసింహారావు వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి పాల్గొన్నారు. అక్కడి వచ్చిన వాళ్లు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. అయితే, చిరంజీవి ఫొటోలు దిగడం ఆపి వేదికపై కూర్చోకపోతే తాను నిర్మొహమాటంగా అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. 

చిరును అవమానించేలా గరికపాటి మాట్లాడారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరికపాటి ఏదో మూడ్‌లో అలా అని ఉంటారని ఆయన చేత క్షమాపణలు చెప్పించుకోవడం తమ ఉద్దేశం కాదని నాగబాబు ట్వీట్ చేశారు. గరికపాటి గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని ఫ్యాన్స్‌కు సూచించారు. 

అయితే, అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు చేశారు. నేరుగా గరికపాటి పేరు వాడకుండా తన దైన శైలిలో విమర్శలు చేశారు. ‘ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రం‌పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె’ అని తేనె తుట్టిని కదిపారు.

అపై మరిన్ని ట్వీట్లు చేశారు. ‘హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి,  నువ్వే తెలుసుకో’ అని  ఓ ట్వీట్ చేశారు.  ‘హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి. సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రికని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు. సర్ నాగబాబుగారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ చిరంజీవి ?’ అంటూ ఆర్జీవీ ట్వీట్లు చేశారు.
RGV
Chiranjeevi
Garikapati
tweets

More Telugu News