ఈడీ విచారణకు హాజరైన టీ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి
- నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
- ఇదివరకే విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి
- యంగ్ ఇండియాకు విరాళాలపై సుదర్శన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ
నోటీసులకు అనుగుణంగా సుదర్శన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు అందించిన కారణంపై సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.