హిందీలో గాడ్ ఫాదర్‌కు మరో 600 స్క్రీన్లు
- దసరా రోజు విడుదలైన చిరు తాజా చిత్రం
- హిట్ టాక్ తో దూసుకెళ్తున్న మల్టీస్టారర్
- రెండు రోజుల్లో 69 కోట్ల వసూళ్లు
దీంతో ఈ మల్టీస్టారర్ సినిమాకు హిందీలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో హిందీలో గాడ్ ఫాదర్ కి ఒక్కసారిగా 600 స్క్రీన్లు పెంచారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన చిత్రానికి ఇంత మంచి విజయం కట్టబెట్టిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.