చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి మేరుగు నాగార్జున
- సోషల్ మీడియా పోస్టుల దుమారం
- చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు
- చిన్నపిల్లలను బెదిరించారని టీడీపీ ఆరోపణలు
- మీడియాలోనూ కథనాలు
- స్పందించిన మంత్రి మేరుగు నాగార్జున
చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అని, ఐటీడీపీలో అతడి పోస్టులు దారుణంగా ఉంటాయని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన పనులకు చంద్రబాబు, లోకేశ్ వంతపాడుతున్నారని ఆరోపించారు. చింతకాయల విజయ్ పై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.