వైసీపీని అలీ వీడుతున్నట్లు వార్తలు.. కొట్టిపారేసిన టాలీవుడ్ కమెడియన్
- తనపై కుట్ర జరుగుతోందన్న అలీ
- వైసీపీలో చేరింది పదవుల కోసం కాదన్న నటుడు
- జగన్‌ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరినట్టు వెల్లడి
- పదవుల కంటే జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమన్న కమెడియన్
తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అలీ తేల్చి చెప్పారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన అలీ... అయినా వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో తాను చేరింది పదవుల కోసం కాదని అలీ చెప్పారు. జగన్ ను సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.