బోయపాటి సినిమాలో రామ్ జోడీగా సాక్షి వైద్య!

Sakshi Vaidya in Boyapati Movie
  • రామ్ 20వ సినిమాకి సన్నాహాలు
  • దర్శకుడిగా బోయపాటి  
  • దసరా తరువాత రెగ్యులర్ షూటింగ్
  • వచ్చే వేసవిలో విడుదల చేసే ఆలోచన 
రామ్ హీరోగా ఒక సినిమా చేయడానికి బోయపాటి రంగంలోకి దిగాడు. రామ్ ఎనర్జీకి .. బోయపాటి మార్క్ కి దగ్గరగా ఉండే సినిమానే ఇది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా పండుగ తరువాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
 
కెరియర్ పరంగా రామ్ కి ఇది 20వ సినిమా. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మొదలు చాలామంది కథానాయికల పేర్లు వినిపించాయి. ఎవరిని ఎంపిక చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 'సాక్షి వైద్య' పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమెను ఎంపిక చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అఖిల్ 'ఏజెంట్' సినిమాతో సాక్షి వైద్య పరిచయమవుతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ జోడీగా సాక్షి వైద్య ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. నెమ్మదిగా సాక్షి వైద్య స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.
Ram
Sakshi Vaidya
Boyapati Sreenu

More Telugu News