Jagan: రెండు రోజుల పాటు తిరుమలలో గడపనున్న సీఎం జగన్... షెడ్యూల్ ఇదిగో!

Jagan going to Tirumala for two days trip
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తిరుమల కొండపైనే గడపనున్నారు. ఈరోజు సాయంత్రం 3.15 గంటలకు ఆయన తాడేపల్లి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 

అనంతరం సీఎం పర్యటన ఇలా కొనసాగుతుంది:
  • సాయంత్రం 3.45 గంటలకు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 
  • 6 నుంచి 6.15 గంటల వరకు అలిపిరి టోల్ గేట్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. 
  • సాయంత్రం 6.40కి తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 
  • అనంతరం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరుతారు. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం వకుళమాత దర్శనం, ప్రదక్షిణం, వెండివాకిలి రంగనాయక మండపం కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
  • సాయంత్రం 8.40 గంటలకు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పొందుతారు. 
  • అనంతరం శ్రీవారి ఆలయంలో వస్త్ర మండలం పెద్ద శేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు. 
  • అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

రేపు సీఎం పర్యటన ఇలా.. 
* ఉదయం 6 గంటలకు పద్మావతి అతిథిగృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయల్దేరుతారు. 
* 6.30 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారు. 
* 6.45 నుంచి 7.05 వరకు పరకామణి భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 
* ఆ తర్వాత పీవీఆర్ గెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. 
* 8.35 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరుతారు. అక్కడి నుంచి విజయవాడకు పయనమవుతారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Tirumala

More Telugu News