CM Jagan: వధూవరులు టెన్త్ పాసైతేనే 'కల్యాణమస్తు' లబ్ది... బాల్య వివాహాల నిరోధానికేనన్న సీఎం జగన్

CM Jagan reviews on child marriages issue
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ ఇవాళ మహిళా శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణలో కల్యాణమస్తు పథకం ప్రత్యేక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. 

అందులో భాగంగానే, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లిచేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలన్న నిబంధన తీసుకువచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాధ తదితరులు కూడా పాల్గొన్నారు.
Go Back to Shorts
CM Jagan
Kalyanamastu
Child Marriages
10th Class
YSRCP
Andhra Pradesh

More Telugu News