బాలీవుడ్​లో రష్మికకు మరో బంపరాఫర్​!
Add ap7am to your home Screen

బాలీవుడ్​లో రష్మికకు మరో బంపరాఫర్​!

Rashmika Mandanna In Aashiqui 3
  • ‘ఆషికీ 3’లో హీరోయిన్ గా చాన్స్ వచ్చినట్టు ప్రచారం
  • హీరోగా నటిస్తున్న కార్తీక్ ఆర్యన్
  • బాలీవుడ్ లో ఇప్పటికే మూడు చిత్రాలు చేస్తున్న రష్మిక
యువ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. దక్షిణాదిలో ఇప్పటికే ఆమెకు భారీ డిమాండ్ ఉండగా.. ‘పుష్ఫ’ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. హిందీలో రష్మిక నటించిన ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.‘యానిమల్‌’ చిత్రం కూడా సెట్స్‌పై ఉంది. ఇలా వెంటవెంటనే మూడు చిత్రాలతో హిందీ జనాలను పలకరించబోతున్న రష్మికకు ఇప్పుడు మరో బంపరాఫర్ తగిలినట్టు తెలుస్తోంది. ‘ఆషికీ 3’లో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. 

బాలీవుడ్ లో ‘ఆషికీ’ సీక్వెల్స్ కు మంచి ఆదరణ ఉంది. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన ‘ఆషికీ’ అప్పట్లో భారీ విజయం సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ సైతం హిట్ అయింది. ఇందులో నటించిన ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘ఆషికీ3’ని చిత్ర బృందం ట్రాక్ లో పెట్టింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ విషయంలో కొన్నాళ్లుగా సస్పెన్స్ ఉంది. అయితే, కార్తీక్ సరసన రష్మికను ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్యే కథ విన్న రష్మిక వెంటనే అంగీకారం చెప్పిందని తెలుస్తోంది. కానీ, అధికారిక ప్రకటన రాలేదు. అదే సమయంలో ఈ మధ్య కార్తీక్ ఆర్యన్ తో కలిసి రష్మిక ఓ యాడ్ లో నటించింది. ఇద్దరి జోడీ చాలా ముచ్చటగా ఉందని బాలీవుడ్ జనాలు, ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆషికీ3’లో వీళ్లు కలిసి నటిస్తే సినిమా హిట్ అవడం ఖాయం అంటున్నారు.
Tollywood
Rashmika Mandanna
Bollywood
ashiqi movie
offer

More Telugu News