Sensex: దేశంలో మరోసారి 5 వేలకు పైగా కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 5,747 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,618 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46,848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,53,374 మంది కరోనా నుంచి కోలుకోగా... 5,28,302 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,41,70,550 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 23,92,530 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.  
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News